టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలి

Oct 27 2025 9:00 AM | Updated on Oct 27 2025 9:00 AM

టెట్‌

టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలి

టీఎస్‌యూటీఎఫ్‌

రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

మెదక్‌జోన్‌: సీనియర్‌ ఉపాధ్యాయులను టెట్‌ పరీక్ష రాయాలనే నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలని టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మెదక్‌లో నిర్వహించిన ఆ సంఘం సమావేశంలో పాల్గొని మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను వెంటనే ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. అలాగే పీఆర్సీని 2023 జులై నుంచి అమలు చేయాలన్నారు. ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని, అందరూ పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రిటైర్డ్‌ ఉపాధ్యాయుల బిల్లులను తక్షణమే విడుదల చేయాలన్నారు. ఈ సమావేశంలో టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు పద్మారావు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు రవీందర్‌ రెడ్డి, కోశాధికారి అజయ్‌, సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

చిన్నారిపై వీధి కుక్క దాడి

చిన్నశంకరంపేట(మెదక్‌): ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపై వీధి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. ఈ ఘటన మండలంలోని మడూర్‌ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన భూమాగౌడ్‌ కూతురు రిషిక(9) ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో ఇంటి ముందు అడుకుంటుంది. ఈ క్రమంలో బాలికపై వీధి కుక్క ఒక్కసారిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. గమనించిన తల్లిదండ్రులు కుక్కను తరిమేశారు. కుక్కదాడిలో చిన్నారి ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

హల్దీవాగులో

గుర్తుతెలియని మృతదేహం

చిన్నశంకరంపేట(మెదక్‌): గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ఎస్‌ఐ నారాయణగౌడ కథనం మేరకు...ఽ ఆదివారం మండలంలోని దరిపల్లి గ్రామ శివారులోని హల్దీవాగులో 45 నుంచి 50 ఏళ్లు ఉన్న మహిళ మృతదేహం లభ్యమైంది. ఆకుపచ్చ చీర, నల్లని జాకెట్‌ ధరించిన మహిళ గోసికట్టి ఉంది. ఉదయం ధరిపల్లి గ్రామస్తులు వాగువద్ద మహిళ శవం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని మెదక్‌ ఏరియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు.

అల్లీపూర్‌ శివారులో..

చిన్నకోడూరు(సిద్దిపేట): గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన మండల పరిధిలోని అల్లీపూర్‌ శివారులో ఆదివారం వెలుగు చూసింది. వివరాలు... గ్రామ శివారులోని గండి చెరువు వద్ద దుర్వాసన వస్తుండటంతో గ్రామస్తులు చెట్లపొదలను పరిశీలించగా మృతదేహం కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ సైఫ్‌ అలీ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నాలుగు రోజుల క్రితం మృతి చెంది ఉంటాడని, 30 ఏళ్లు ఉంటాయని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సిద్దిపేట ఆస్పత్రికి తరలించారు.

సంత్రాల వాహనం బోల్తా

హుస్నాబాద్‌రూరల్‌: మండలంలోని మీర్జాపూర్‌ క్రాసింగ్‌ వద్ద ఆదివారం సంత్రాలతో వెళ్తున్న వాహనం బోల్తా పడింది. స్థానికుల కథనం ప్రకారం... మహారాష్ట్ర నుంచి వరంగల్‌కు బొలెరో వాహనంలో సంత్రాలను తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో పోతారం(ఎస్‌) దాటిన తర్వాత ముందు వెళ్తున్న జేసీబీ సడన్‌గా మీర్జాపూర్‌ వైపు క్రాస్‌ కావడంతో వెనుక ఉన్న బొలెరో డ్రైవర్‌ ప్రమాదంను తప్పించడానికి రోడ్డు వైపు తిప్పడంతో బోల్తా పడింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని ప్రమాదం వివరాలు తెలుసుకున్నారు.

టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలి 1
1/2

టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలి

టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలి 2
2/2

టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement