వడ్ల కుప్పలను ఢీకొట్టిన బైక్
అక్కన్నపేట(హుస్నాబాద్): రోడ్డు ప్రమాదంలో తండ్రి,కొడుకు తీవ్రగాయాల పాలయ్యారు. ఈ ఘటన మండలంలోని బంజారాహిల్స్ తండా వద్ద ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. బాధితులు, స్థానికుల వివరాల ప్రకారం... దూల్మిట్ట మండలం బెక్కల్ గ్రామ పరిధిలోని శివాలితండాకు చెందిన లకావత్ రవి, అతని తండ్రి ఉమా ఇద్దరు కలిసి రోజు కూలీ పని నిమిత్తం బైక్‌పై కరీంనగర్‌కు వెళ్లి వస్తుంటారు. ఈ క్రమంలో బంజారాహిల్స్ తండా వద్ద రోడ్లపై ఆరబోసిన వడ్ల కుప్పులు చీకట్లో కనిపించకపోవడంతో ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరి ముఖాలకు, కాళ్లకు గాయాలయ్యాయి. వెంటనే హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి , అక్కడి నుంచి సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రమాదంలో తండ్రీకొడుకులకు గాయాలు


