కేటగిరీల వారీగా ఓటరు జాబితా
కలెక్టర్ ప్రావీణ్య
సంగారెడ్డి జోన్: ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నాలుగు కేటగిరీల వారీగా ఓటరు జాబితా రూపొందించనున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి, అదనపు అధికారి లోకేష్ కుమార్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు అదనపు కలెక్టర్ మాధురితో కలిసి హాజరయ్యారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఎల్‌ఓలు, సూపర్‌వైజర్లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ముందుగా కేటగిరీ ఏ ఓటర్ల ధృవీకరణ పూర్తయ్యాక కేటగిరీ బీ, సీ, డీలను ఏకు లింక్ చేసే ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా దశలవారీగా ప్రక్రియ పూర్తి చేస్తామని వివరించారు.


