రోడ్డు విస్తరణ సర్వే షురూ
జోగిపేట(అందోల్): పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు రోడ్లు భవనాల శాఖ, రెవెన్యూ, మున్సిపల్ శాఖ అధికారులు శనివారం సర్వే నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహం నుంచి మాసానిపల్లి చౌరస్తా వరకు ఇరువైపులా సర్వే నిర్వహించారు. రోడ్డు మద్య నుంచి ఇరువైపులా 35 మీటర్లు చొప్పున మొత్తం రోడ్డు 70 మీటర్లుగా వేసేందుకు అధికారులు కొలతలు చేపట్టారు. రోడ్డు మధ్యలో డివైడర్‌తో పాటు ఇరువైపులా మురికి కాలువల నిర్మాణం చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సుమారు వంద ఇళ్ల వరకు కూల్చి వేయాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇటీవలే నిర్మించిన బాలికల ఉన్నత పాఠశాల ప్రహరీతో పాటు, నూతన తరగతి గదులు కూడా చాలా వరకు కూల్చివేయక తప్పదని అంటున్నారు. కాగా రోడ్డు విస్తరణతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంతో పాటు రవాణా సౌకర్యాలు మెరుగు పడే అవకాశం ఉంది.


