
యువతి అదృశ్యం
నర్సాపూర్ రూరల్: యువతి అదృశ్యమైంది. ఈ ఘటన నర్సాపూర్ మండలం తిరుమలాపూర్‌లో శనివారం జరిగింది. ఎస్సై రంజిత్ రెడ్డి వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన బొమ్మల లక్ష్మి కూతురు తులసి (19) రోజులాగే తాను పనిచేస్తున్న మార్ట్‌కు వెళ్తున్నానని శనివారం ఉదయం ఇంట్లో చెప్పి బయలుదేరింది. రాత్రి 10 గంటల వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో బంధువుల వద్ద వెతికినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా తల్లి బొమ్మల లక్ష్మి తన కూతురు నారాయణపూర్‌కు చెందిన బలిజ రాజు అపహరించుకుపోయాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆటో డ్రైవర్‌కు గాయాలు
చేగుంట(తూప్రాన్): రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ఈ ఘటన మాసాయిపేట మండల శివారులోని 44వ జాతీయ రహదారి బంగారమ్మ దేవాలయ సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం... చేగుంట నుంచి హైదరాబాద్ వైపునకు వెళుతున్న ట్రాలీ ఆటోను వెనకాల వస్తున్న బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ రహ మాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అత డ్ని తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.