
పనులు త్వరగా పూర్తి చేయాలి
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
మిరుదొడ్డి(దుబ్బాక): అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని, నాణ్యతా ప్రమాణా లు పాటించాలని సదరు కాంట్రాక్టర్‌కు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సూచించారు. ఆదివారం అక్బర్‌పేట – భూంపల్లి మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులు, పీహెచ్‌సీ ప్రహరీ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టూబీహెచ్‌కే దాసరి కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. తదుపరి పనులను త్వరలోనే ప్రారంభించాలన్నారు. ఆయన వెంట నాయకులు జన్నారెడ్డి, శ్రీనివాస్, జనార్దన్, రమేశ్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
హెల్ప్..హెల్ప్
పొదల్లో హైవే హెల్ప్‌లైన్ బోర్డు
కౌడిపల్లి(నర్సాపూర్): హెల్ప్‌లైన్ బోర్డుకు సహాయం కావాల్సి వచ్చింది. జాతీయ రహదారులపై అత్యవసర సేవలు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన 1033 నంబర్‌బోర్డు ముళ్ల పొదల్లో చిక్కుకుంది. దీంతో వాహనదారులకు నంబర్ కనిపించడం లేదు. మండల కేంద్రమైన కౌడిపల్లి సమీపంలో బ్రిడ్జి వద్ద 765డి జాతీయ రహదారి సైడ్‌రేలింగ్ పక్కన హెల్ప్‌లైన్ నంబర్ బోర్డును ఏర్పాటు చేశారు. బోర్డు చుట్టూ పిచ్చిమొక్కలు, పొదలు పెరిగిపోవడంతో నంబర్ కనిపించడం లేదు. ఈ ఉచిత టోల్‌ఫ్రీ నంబర్‌తో జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదాలు, ఇంథనం అవసరం, అంబులెన్స్ ఇతర అత్యవసర పరిస్థితుల్లో వాహనదారులు ఫోన్ చేసినట్లయితే ప్రభుత్వం వారికి సేవలు కల్పింస్తుంది. బోర్డు చుట్టూ ముళ్లపొదలను తొలగించి నంబర్ కనిపించేలా చేయాలని వాహనదారులు కోరుతున్నారు.
అక్రమంగా తరలిస్తున్న గోవులు స్వాధీనం
ములుగు(గజ్వేల్): అక్రమంగా తరలిస్తున్న గోవులను వంటిమామిడి వద్ద రాజీవ్‌రహదారిపై ఆదివారం బీజేపీ, గోరక్షక్, బజరంగ్‌దళ్ నాయకులు అడ్డుకున్నారు. ఒడిశా నుంచి కొందరు వ్యక్తులు ఓ కంటైనర్ వాహనంలో 150 గోవులను హైదరాబాద్‌కు తీసుకెళుతున్నారు. ఈ క్రమంలో సమాచారం అందుకున్న మండల బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌గౌడ్ ఆధ్వర్యంలో వాహనాన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ములుగు ఎస్‌ఐ విజయ్‌కుమార్ గోవులతో ఉన్న వాహనాన్ని స్వాధీన చేసుకున్నారు. గోవులను తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేశారు. అనంతరం ఎస్‌ఐ గోవులను అక్కడి నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం చల్లూరు గోశాలకు తరలించారు.
విద్యుదాఘాతంతో
పూరి గుడిసె దగ్ధం
హవేళిఘణాపూర్(మెదక్): విద్యుదాఘాతంతో పూరిగుడిసె దగ్ధమైంది. ఈ ఘటన మండల పరిధిలోని స్కూల్ తండా పంచాయతీ పరిధి లో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. తండాలో నివాసముంటున్న పూల్య నిత్యంలాగే వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లగా విద్యుదాఘాతంతో మంటలు చెలరేగి పూరిగుడిసెలో ఉన్న నిత్యావసర వస్తువులు, నగదు కాలిబూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో దాదాపు రూ.5 లక్షల వరకు నష్టం జరిగినట్లు బాధితుడు పూల్య తెలిపాడు. ఘటనా స్థలాన్ని ఎస్‌ఐ నరేశ్ సందర్శించి వివరాలు సేకరించారు. తమకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి ఆదుకోవాలని అధికారులను కోరారు.
దొంగ అరెస్ట్
మెదక్ మున్సిపాలిటీ: పట్టణంలోని హనీ బేకరీ తాళం పగులగొట్టి సీసీ కెమెరాలు ఎత్తుకెళ్లిన దొంగను పోలీసులు అరెస్టు చేశారు. పట్టణ సీఐ మహేశ్ వివరాల ప్రకారం... దర్యాప్తులో భాగంగా పోలీసులు కౌడిపల్లి మండల కేంద్రానికి చెందిన శరత్‌గా గుర్తించారు. నిందితుడు గతంలో కూడా ఓ కేసులో జైలుకు వెళ్లివచ్చినట్లు తెలిపారు.

పనులు త్వరగా పూర్తి చేయాలి

పనులు త్వరగా పూర్తి చేయాలి

పనులు త్వరగా పూర్తి చేయాలి