
మంచి అవకాశం
రాష్ట్ర వ్యవసాయ శాఖ ద్వారా రూపొందించిన వాట్సాప్ ఛానల్ చాలా బాగుంది. రైతులకు కావాల్సిన పూర్తి సమాచారం ఇందులో దొరుకుతుంది. ఏ సీజన్‌లో ఎలాంటి పంటలు వేయాలి. ఎలాంటి మందులు ఎంత మోతాదులో వాడాలి. పంటల సాగులో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలు వంటి అంశాలపై సూచనలు పొందవచ్చు. – శ్యామ్, రైతు,తొగిట, హవేళిఘనాపూర్
అవగాహన కల్పిస్తున్నాం
జిల్లాలో 76 క్లస్టర్లు ఉన్నాయి. ఆయా క్లస్టర్ల పరిధిలోని ఏఈఓల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. స్మార్ట్ ఫోన్లు ఉన్న రైతులంతా ఛానల్‌లో చేరేలా కృషి చేస్తున్నాం. జిల్లాలో ఇప్పటి వరకు 30శాతం రైతులు ఈ ఛానల్‌లో చేరారు. రైతులంతా ఛానల్‌లో చేరి అవసరమైన వ్యవసాయ సమాచారం పొందాలి.
– దేవ్‌కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి, మెదక్

మంచి అవకాశం