
హత్యాయత్నం కేసులో నిందితుడి అరెస్టు
జహీరాబాద్ టౌన్: హత్యాయత్నం కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం టౌన్ ఎస్‌ఐ.వినయ్‌కుమార్ కేసు వివరాలు వెల్లడించారు. తమిళనాడు మధురై జిల్లా పరిమల్‌పట్టికి చెందిన పుతురాజు పట్టణంలోని ఐడీఎస్‌ఎంటీ కాలనీలో నివాసం ఉంటున్నాడు. స్నాక్స్, కారబుంది తయారు చేసి అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో తమిళనాడుకు చెందిన మరో వ్యక్తి మణికంఠ పట్టణంలోని హమాలీ కాలనీలో నివాసం ఉంటూ ఆయన కూడా ఇదే వ్యాపారం చేస్తున్నాడు. తాను వ్యాపారం చేస్తున్న ప్రాంతాల్లో పుతురాజ్ బిజినెస్ చేస్తున్నాడని కక్షపెంచుకున్న మణికంఠ శనివారం కత్తితో దాడి చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.