
కలాం జీవితం స్ఫూర్తిదాయకం
పటాన్‌చెరు: అత్యంత సామాన్య కుటుంబం నుంచి జీవితాన్ని ప్రారంభించి.. దేశ అత్యున్నత రాష్ట్రపతి పదవి చేపట్టడంతోపాటు రక్షణ రంగంలో మిస్సైల్‌మెన్‌గా గుర్తింపు పొందిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవితం నేటితరం యువతకు స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పేర్కొన్నారు. డాక్టర్ అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకుని బుధవారం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలోని అబ్దుల్ కలాం విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ..అబ్దుల్ కలాం ఆశయాలను భవిష్యత్తు తరాలకు అందించాలన్న సమున్నత లక్ష్యంతో ప్రత్యేకంగా కేజీ టు పీజీ విద్యా ప్రాంగణంలోనే ఆయన కాంస్య విగ్రహాన్ని సొంత నిధులతో ఏర్పాటు చేశామన్నారు. ప్రతీరోజు ఆయన విగ్రహాన్ని చూసినప్పుడల్లా ప్రతీ విద్యార్థి అబ్దుల్ కలాం జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో పటాన్‌చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్‌కుమార్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి, గూడెం మధుసూదన్ రెడ్డి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ అశోక్, పట్టణ పుర ప్రముఖులు, సీనియర్ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి