
కేతకీలో సీనియర్ సివిల్ జడ్జి పూజలు
ఝరాసంగం(జహీరాబాద్): శ్రీ కేతకీ సంగమేశ్వరాలయంలో జిల్లా కోర్టు సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రెటరీ బి.సౌజన్య, జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వసంతకుమారి బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. గర్భగుడిలోని పార్వతీ పరమేశ్వరులకు అభిషేకం, కుంకుమార్చన, మహా మంగళహారతి తదితర పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామి వారికి తీర్థప్రసాదాలు అందించి సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ పాలకమండలి చైర్మన్ చంద్రశేఖర్ పాటిల్, ఈఓ శివ రుద్రప్ప, ఎస్సై క్రాంతి కుమార్ పాటిల్, సిబ్బంది పాల్గొన్నారు.
సజ్జనార్‌కు
‘ఫొటోఫ్రేమ్’ అందజేత
కల్హేర్(నారాయణఖేడ్): సిర్గాపూర్ మండలం జంల తండాకు చెందిన రాష్ట్ర బంజార సంఘం నాయకులు చరణ్‌సింగ్ బుధవారం హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్‌ను కలిసి ఘనంగా సన్మానించారు. అనంతరం సజ్జనార్‌కు ఫోటో ఫ్రేమ్ అందజేశారు.
ఆశ్రమ పాఠశాల తనిఖీ
నారాయణఖేడ్: ఖేడ్ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల, వసతిగృహాన్ని స్థానిక
సబ్ కలెక్టర్ ఉమాహారతి బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యాబోధన, భోజనం నాణ్యత విషయాల గురించి విద్యార్థులను ఆరా తీశారు. వసతిగృహంలో సమస్యలు, అవసరాలను గురించి వసతిగృహం సంక్షేమ అధికారిణి బాలమణిని అడిగి తెలుసుకున్నారు. విద్య, మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం, వసతి, పరిశుభ్రత తదితర విషయాల్లో నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు.
బీసీ రిజర్వేషన్లపై
కేంద్రం చట్టం చేయాలి
సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు
సంగారెడ్డి ఎడ్యుకేషన్: బీసీ రిజర్వేషన్లపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెంటనే చట్టం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని కేవల్‌కిషన్ భవన్‌లో బుధవారం నిర్వహించిన సీపీఎం ముఖ్య కార్యకర్తల సమావేశంలో జయరాజ్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా జయరాజు మాట్లాడుతూ...రాష్ట్రంలో 42% బీసీ రిజర్వేషన్లను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. కేంద్రం వెంటనే 42% రిజర్వేషన్ అమలు బిల్లును ఆమోదించాలని, పార్లమెంట్‌లో చట్టాన్ని తీసుకురావాలని కోరారు. అదేవిధంగా 9వ షెడ్యూల్‌లో రిజర్వేషన్ల ఏర్పాటుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మాణిక్యం, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సింగూరులో
జలవిద్యుత్ ఉత్పత్తి
పుల్‌కల్(అందోల్): సింగూరు ప్రాజెక్టుకు స్వల్పంగా వరద కొనసాగుతోంది. దీంతో క్రస్టు గేట్లు మూసివేసి జలవిద్యుత్ కేంద్రం ద్వారా రోజుకు 2,500 క్యూసెక్కుల నీటితో రెండు టర్బయిన్లను ఆన్ చేసి 0.5 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు.

కేతకీలో సీనియర్ సివిల్ జడ్జి పూజలు

కేతకీలో సీనియర్ సివిల్ జడ్జి పూజలు

కేతకీలో సీనియర్ సివిల్ జడ్జి పూజలు