
కార్యకర్తల అభీష్టం మేరకే ఎంపిక
రామచంద్రాపురం(పటాన్‌చెరు): కార్యకర్తల అభీష్టం మేరకే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎంపిక జరుగుతుందని ఏఐసీసీ పరిశీలకురాలు సిజరిట స్పష్టం చేశారు. రామచంద్రాపురం పట్టణంలో నియోజకవర్గ ఇంచార్జ్ కాటా శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడి ఎంపికపై అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండల, బ్లాక్, గ్రామస్థాయి కార్యకర్తల అభిప్రాయాల సేకరించి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని ఎంపిక చేస్తామన్నారు. అధిష్టానం ఎవరిని నియమించినా అందరూ కలసికట్టుగా, ఐక్యం ఉండి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు, రాష్ట్ర సీనియర్ నాయకులు నీలం మధు, గాలి అనిల్ కుమార్, శశికళ, చిన్న ముదిరాజ్, జిల్లా నాయకులు మవీన్ గౌడ్, అరుణ్ గౌడ్, శ్యామ్‌రావు, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.
డీసీసీ అధ్యక్షుడి ఎంపికపై
ఏఐసీసీ పరిశీలకురాలు సిజరిట