
భద్రతా ప్రమాణాలు పాటించాలి
రామచంద్రాపురం(పటాన్‌చెరు): ప్రతి ఒక్కరూ పనులు చేసే సమయంలో భద్రత నియమాలు పాటించాలని కార్మిక శాఖ అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు. సోమవారం రాష్ట్ర లోక్ జనశక్తి పార్టీ రామ్‌విలాస్ లేబర్ సేల్ అధ్యక్షుడు సురేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్మిక చట్టాలపై అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి కార్మిక చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు పెంటయ్య, చారి, జనార్దన్, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.