
బాబాయ్ దశదిన కర్మకు వెళ్లి..
జగదేవ్‌పూర్(గజ్వేల్): బాబాయ్ దశదినకర్మకు వెళ్లి అబ్బాయ్ చెరువులో మునిగి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని తిగుల్ గ్రామంలో సోమవారం జరిగింది. ఎస్‌ఐ కృష్ణారెడ్డి, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన సర్ధగాని చిన్నరాజు(35), రజిత దంపతులు. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. రాజు గ్రామంలో టెంట్‌హౌస్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వరుసకు బాబాయ్‌లు అయినా సర్ధగాని యాదగిరి, సర్ధగాని నర్సయ్యల దశదినకర్మ కార్యక్రమానికి సోమవారం గ్రామంలోని కుటుంబ సభ్యులతో కలిసి మహాసముద్రం చెరువు కట్ట వద్దకు వెళ్లారు. తలనీలాలు అనంతరం చెరువులోకి దిగి స్నానం చేస్తుండగా రాజు ప్రమాదవశాత్తు నీటిలో మునిగాడు. వెంటనే కుటుంబ సభ్యులు చెరువులోకి దిగి రాజును బయటకు తీయగా అప్పటికే మృతి చెందాడు. కళ్ల ఎదుట భర్త మృతి చెందడంతో భార్యాపిల్లల రోదనలు మిన్నంటాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
పాము కాటుతో..
కొమురవెల్లి(సిద్దిపేట): పాము కాటుకు ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని గౌరాయపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన పెద్ది నర్సింహారెడ్డి(57) ప్రతి రోజు మాదిరిగా వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. చేనులో వ్యవసాయ పనులు చేస్తుండగా పాము కరిచింది. వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు చేర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.
ఎద్దు పొడిచి వృద్ధుడు..
హుస్నాబాద్‌రూరల్: ఎద్దు పొడవడంతో వృద్ధుడు మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన హుస్నాబాద్ మండలం మాలపల్లిలో సోమవా రం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన సొల్లు రాజయ్య(75) రోజులాగే బావి వద్ద పశువు లను మేతకు విడిచే క్రమంలో ఎద్దు పొడవడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించాడు. గమనించిన చుట్టు పక్కల రైతులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోలీసులు హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భార్య బాలవ్వ ఫిర్యాదు మేరకు ఎస్సై లక్ష్మారెడ్డి కేసు నమోదు చేసుకున్నారు.
చికిత్స పొందుతూ వృద్ధుడు..
రామచంద్రాపురం(పటాన్‌చెరు): చికిత్స పొందుతూ గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం... గత నెల 30న రాత్రి రామచంద్రాపురం పట్టణంలో ఆర్టీసీ డిపో సమీపంలో గుర్తుతెలియని వృద్ధుడు అపస్మారక స్థితిలో పడి ఉన్నాడని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని వృద్ధుడిని పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ ఈనెల 11న రాత్రి మృతి చెందాడు. అతడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు.
మృతదేహం లభ్యం
శివ్వంపేట(నర్సాపూర్): మండల పరిధిలోని రత్నాపూర్ గ్రామ శివారు అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. గుర్తించిన పశువులు కాపరులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై మధుకర్‌రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహన్ని నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మతిస్థిమితం లేని వ్యక్తి ఇటువైపునకు వచ్చి ఆకలితో అలమటించి మృతిచెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి వయ స్సు 55 సంవత్సరాలు ఉంటుందని తెలిపారు.

బాబాయ్ దశదిన కర్మకు వెళ్లి..

బాబాయ్ దశదిన కర్మకు వెళ్లి..