
చేపల వేటకు వెళ్లి యువకుడు గల్లంతు
కొల్చారం(నర్సాపూర్): చేపల వేటకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు నదిలో పడి గల్లంతయ్యాడు. ఈ ఘటన సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. కొల్చారం ఎస్‌ఐ హైమద్ మోహినోద్దీన్ వివరాల ప్రకారం... మండలంలోని అప్పాజీపల్లి గ్రామానికి చెందిన బుడ్డెన్నోళ్ల సురేశ్ ఆనకట్టకు నీటి ప్రవాహం తగ్గడంతో చేపల వేటకు వెళ్లాడు. ఆనకట్ట దిగువన చిన్నఘనాపూర్ పరిధి లోని మెకానికల్ బ్రిడ్జి వైపు చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు నదిలో పడి గల్లంతయ్యాడు. కొద్ది దూరంలో ఉన్న జాలరులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ మెదక్ నుంచి అగ్నిమాపక సిబ్బందితోపాటు టీజీఎఫ్ బృందాల ను రప్పించి గాలించారు. చీకటి పడటంతో గాలింపు చర్యలు నిలిపివేశారు. తిరిగి మంగళవారం గాలింపు చర్యలు చేపడతామని ఎస్సై తెలిపారు.