
పది ప్రత్యేక తరగతుల పరిశీలన
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): మండలంలోని నిజాంపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న పదో తరగతి ప్రత్యేక తరగతులను డీఈఓ వెంకటేశ్వర్లు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశా రు. విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి వారి సామర్‌ాధ్యన్ని పరిశీలించారు. పాఠశాలలో సదుపాయా లు, తరగతుల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. పదిలో ఉత్తమ ఫలితాలు సాధించి తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తేవాలన్నారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎం రాజశ్రీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
రామకృష్ణకు అభినందన
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): మండలంలోని నిజాంపూర్ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం రామకృష్ణను సోమవారం డీఈఓ వెంకటేశ్వర్లు అభినందించారు. వివరాల ప్రకారం.. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీచర్చ్ అండ్ ట్రైనింగ్ తెలంగాణ, నేషనల్ సెంటర్ ఫర్ స్కూల్ లీడర్ షిప్(నీపా న్యూఢిల్లీ) సంయుక్త ఆధ్వర్యంలో స్కూ ల్ లీడర్షిప్ అకాడమీ తెలంగాణ ట్రయల్ బ్లేజర్స్ 2025 పేరుతో పుస్తకాన్ని ప్రచురించింది. ఇందులో హెచ్‌ఎం రామకృష్ణతో పాటుగా అదే పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయురాలు సునీతకు స్థానం దక్కింది. విద్యాభివృద్ధికి హెచ్‌ఎం రామకృష్ణ చేస్తున్న కృషిని డీఈఓ అభినందించారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం రామకృష్ణ ట్రయల్ బ్లేజర్స్ పుస్తకాన్ని డీఈఓ వెంకటేశ్వర్లుకు అందజేశారు. కార్యక్రమంలో నిజాంపూర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు రాజశ్రీ, తదితరులు పాల్గొన్నారు.

పది ప్రత్యేక తరగతుల పరిశీలన