
యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి
యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డీఎస్పీ సైదులు
పటాన్‌చెరు టౌన్: యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని యాంటి నార్కోటిక్స్ బ్యూరో డీఎస్పీ సైదులు అన్నారు. సోమవారం సాయంత్రం పటాన్‌చెరు మండలం ఐనోల్ గ్రామంలో హైదరాబాద్ బేగంపేట్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విద్యార్థినులతో ఎన్‌ఎస్‌ఎస్ వింటర్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాంప్ వద్ద మాదకద్రవ్యాలతో కలిగే నష్టాలపై డీఎస్పీ అవగాహన కల్పించారు. ఎన్‌ఎస్‌ఎస్ శిబిరాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచడంతో పాటు సమాజంపై అవగాహన కల్పిస్తుందన్నారు. చదువు మీరు కోరుకున్న లక్ష్యాన్ని దగ్గర చేస్తుందని తెలిపారు. ఎవరైనా మత్తు పదార్థాలకు అలవాటు పడితే పోలీసులకు, అధ్యాపకులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ నరసింహులు, డాక్టర్ ఎం.మధుకర్, నార్కొటిక్స్ సీఐ శ్రీనివాస్ పాల్గొన్నారు.