
వేర్వేరు చోట్ల ఇద్దరు అదృశ్యం
చిలప్‌చెడ్(నర్సాపూర్): వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన మండలంలోని చండూర్ గ్రామంలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఎస్‌ఐ నర్సింహులు వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన దూదేకుల యూసుఫ్ మద్యానికి బానిసై తరుచూ తాగి భార్య రిజ్వానాతో గొడవపడేవాడు. ఈ క్రమంలో ఈ నెల 3న తాగి వచ్చిన యూసుఫ్ భార్యతో గొడవపడ్డాడు. అనంతరం రాత్రి 9 గంటలకు కుటుంబసభ్యులతో భోజనం చేసి పడుకున్నాడు. తెల్లవారిన తరువాత చూస్తే యూసుఫ్ కనపడలేదు. దీంతో కుటుంబ సభ్యులు అతడి ఆచూకీ కోసం స్నేహితులు, బంధువుల వద్ద ఆరా తీసినా ఫలితం లేదు.
తెల్లాపూర్‌లో యువతి..
రామచంద్రాపురం(పటాన్‌చెరు): యువతి అదృశ్యమైన ఘటన తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కొమురంభీమ్ కాలనీకి చెందిన గంగమ్మ స్థానికంగా అపార్ట్‌మెంట్‌లోని ఇళ్లలో పనిచేస్తుంది. కాగా మధ్యాహ్నం ఆటోలో బయటకు వెళ్లింది. తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.