
చట్ట ప్రకారం అగ్రిమెంట్లు చెల్లవు
మార్టిగేజ్ ప్రాపర్టీస్‌కే లీగల్‌రైట్స్ ఉంటాయి. అప్పుల కోసం ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవడం సరికాదు. ఇంటర్నల్‌గా రెండు పార్టీలు బాండ్ పేపర్లపై, తెల్లకాగితాలపై చేసుకునే అగ్రిమెంట్లు కోర్టు అంగీకరించదు. సేల్‌డీడ్ ఉంటే ఆస్తిపై సర్వహక్కులు కోల్పోయినట్లే. అప్పు తీసుకున్న వ్యక్తి దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్ ఉన్నా.. కబ్జాలో తామే ఉన్నట్టు రుజువు చూపిస్తే కొంత వరకు సేఫ్. కోర్టులో ప్రూవ్ చేయడానికి చాలా సమయం పడుతుంది. బ్యాంకులు మార్టిగేజ్ చేసుకుంటాయి తప్పా ఆస్తులను అనుభవించవు. ప్రైవేటు వడ్డీ వ్యాపారులు ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవడం మంచి విధానం కాదు. – సార వెంకటవర్మ, న్యాయవాది, జోగిపేట