
వెంటనే రోడ్లకు మరమ్మతులు
సంగారెడ్డి జోన్: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారుల మరమ్మతుల పనులు వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ పి.ప్రావీణ్య ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రోడ్డు రవాణా సౌకర్యం లేని గిరిజన తండాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలన్నారు. గిరిజన సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్ విభాగం నుంచి మంజూరైన నిధుల నుంచి పనులు చేపట్టేందుకు టెండర్ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి తదితరులు పాల్గొన్నారు.
కోరిన సమాచారం అందించాలి
సమాచార హక్కు చట్టంలో భాగంగా దరఖాస్తుదారుడు కోరిన సమాచారాన్ని పూర్తిస్థాయిలో అందించాలని కలెక్టర్ సూచించారు. సమాచార హక్కు చట్ట వారోత్సవాలను పురస్కరించుకొని సోమవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పూర్తి సమాచారంతో కూడిన సమాచార హక్కు చట్టం బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.
ప్రజావాణికి 38 దరఖాస్తులు
ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అధికారులతో కలిసి ప్రజల నుంచి సమస్యలపై వినతులను స్వీకరించారు. ఈ మేరకు 38 అర్జీలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
కలెక్టర్ పి.ప్రావీణ్య ఆదేశం