
ఒప్పందం వెనుక ఆంతర్యమేమిటో!
టెండర్ ప్రక్రియను ప్రారంభిస్తాం
తడి, పొడి చెత్త విభభజనపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు బసిల్ ఏజెన్సీకి అప్పగించాం. చెత్త విభజనపై కరపత్రాలు పంపిణీ చేస్తూ అవగాహన కల్పిస్తున్నాం. పొడి చెత్త అమ్మకంపై వచ్చే ఆదాయం నుంచి మున్సిపల్‌కు కొంత డబ్బు రావాల్సి ఉంటుంది. ఏజెన్సీ మాత్రం మున్సిపల్‌కు డబ్బులు ఇవ్వడం లేదు. ఇక నుంచి పొడి చెత్తపై టెండర్ ప్రక్రియను చేపడుతాం.
మల్లికార్జున్, మున్సిపల్ కమిషనర్
ప్రతి రోజు ఇళ్ల నుంచి చెత్త సేకరణకు వినియోగించే ఆటోలు, ట్రాక్టర్, అందులో పోసే డీజిల్ ఖర్చంతా మున్సిపాలిటీదే. చెత్తను సేకరించి డీఆర్‌సీసీ సెంటర్‌కు తరలించేది మున్సిపల్ కార్మికులు. చెత్తను నిల్వ చేసేందుకు ఏర్పాటు చేసిన షెడ్డు మున్సిపల్‌దే. వాహనాలు, వాటి మరమ్మతుల ఖర్చులన్ని మున్సిపల్‌వే. అలాంటప్పుడు పొడి చెత్త ద్వారా వచ్చే ఆదాయంలో మున్సిపాలిటీకి నయా పైసా రావడంలేదు. గంపగుత్తగా అమ్ముకోవడానికి చేసుకున్న ఒప్పందం వెనుక ఆంతర్యమేమిటని స్ధానికులు ప్రశ్నిస్తున్నారు. పొడి చెత్త నుంచి వచ్చే ఆదాయంలో కనీసం 30 శాతం మున్సిపల్‌కు చెల్లించాల్సి ఉంటుంది. పొడి చెత్తలో వచ్చే ప్లాస్టిక్ వస్తువులు, ఖాళీ సీసాలు, అట్టలు ఇలా వచ్చిన వస్తువులకు గాను కిలో కొంత కార్మికులకు ఇన్‌సెంటివ్ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే వార్డుల వారీగా తడి, పొడి చెత్త విభజనపై సంస్ధ నిర్వాహకులు ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉన్నా ఎక్కడా అలాంటి దాఖలాలు లేవు.