
దైవచింతనతోనే మానసిక ప్రశాంతత
మహంకాళి దేవాలయ వార్షికోత్సవంలో
ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి
పటాన్‌చెరు టౌన్: దైవచింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి పేర్కొన్నారు. పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని శనివారం మహంకాళి అమ్మవారి దేవాలయం వార్షికోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. దేవాలయం ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాలను ఆయన అభినందించారు.
ప్రతీ తరగతికి టీచర్‌ను నియమించాలి
యూటీఎఫ్ నాయకుల డిమాండ్
జహీరాబాద్: ప్రతీ తరగతికి ఒక ఉపాధ్యాయుడిని కేటాయించి ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేయాలని యూటీఎఫ్ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. జహీరాబాద్‌లోని శ్రామిక భవన్‌లో శనివారం యూనియన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ...ప్రభుత్వ పాఠశాలలను బతికించుకుని దేశంలో పేద పిల్లలకు నాణ్యమైన ఉచిత విద్యను అందించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించి విద్యా కమిషన్ వేసి సలహాలు తీసుకోవడం అభినందనీయమని తెలిపారు. యూటీఎఫ్ అగ్రనేత నాగటి నారాయణ తృతీయ వర్ధంతిని పురస్కరించుకుని నివాళులర్పించారు.
గిరిజన భాష నటుడు
కేపీకి పితృ వియోగం
పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు
జహీరాబాద్ టౌన్: మండలంలోని గమ్యానాయక్ తండాకు చెందిన గిరిజన భాష నటుడు కేపీ చవాన్ తండ్రి గిరియా నాయక్ అనారోగ్యంతో మృతి చెందారు. కేపీ చవాన్ బంజారా భాషలో పలు చిత్రాల్లో నటించి దర్శకత్వం వహించారు. తండ్రి గిరియా నాయక్ కూడా కొడుకును హీరోగా పెట్టి సినిమా తీశారు. కాంగ్రెస్ నాయకులు మాజీ కార్పొరేషన్ చైర్మన్ తన్వీర్, జాగో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాములు నేత,మాజీ కౌన్సిలర్ మోతిరాం రాథోడ్ తదితరులు తండాకు వెళ్లి నటుడు కేపీ చవాన్‌ను పరామర్శించారు.
కందకం రోడ్డు
పనులు పూర్తి చేయాలి
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
సదాశివపేట(సంగారెడ్డి): కందకం రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని ఆ రోడ్డును ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయిస్తానని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఈ రోడ్డు పూర్తయితే పట్టణ రూపురేఖలు మారుతాయని చెప్పారు. పట్టణంలోని కందకం రోడ్డుపై ఆర్ ఆండ్‌బీ, మున్సిపల్ అధికారులతో టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలారెడ్డి, జగ్గారెడ్డి దంపతులు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ...తాను 2014లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి మహీధర్‌రెడ్డి చొరవతో కందకం రోడ్డు నిర్మాణానికి రూ.20 కోట్ల నిధులు మంజూరు చేయించానన్నారు. ఈ 11 ఏళ్లలో రూ.15కోట్లు ఖర్చు చేసి ఇప్పటివరకు ఈ రోడ్డును ఎందుకు పూర్తి చేయలేకపోయారని అధికారులను నిలదీశారు.

దైవచింతనతోనే మానసిక ప్రశాంతత

దైవచింతనతోనే మానసిక ప్రశాంతత

దైవచింతనతోనే మానసిక ప్రశాంతత