
బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే
ఆందోళన చేస్తున్న బీసీ విద్యార్థి సంఘం నేతలు
సంగారెడ్డి: బీసీలకు అన్యాయం చేస్తే సహించేది లేదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు గౌడ్ హెచ్చరించారు. వైఎస్సార్ భవన్‌లో ఆ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ప్రభుగౌడ్ పాల్గొని మాట్లాడారు. బీసీలకు 42% రిజర్వేషన్లపై హైకోర్టుకు వెళ్లిన వారు తిరిగి పునరాలోచన చేసి కేసు వాపసు తీసుకోవాలని హితవు పలికారు. బీసీల మీద రాజకీయాలు చేయకుండా బీజేపీ న్యాయం చేయాలన్నారు. హైకోర్టు తీర్పు ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలని కోరారు.
బీసీ విద్యార్థి సంఘాల నిరసన
బీసీ రిజర్వేషన్ల విషయమై సంగారెడ్డిలో బీసీ విద్యార్థి సంఘాలు శుక్రవారం ధర్నా నిర్వహించాయి. స్థానిక బస్టాండ్ ముందు బైఠాయించారు. బీసీలకు 42% రిజర్వేషన్లను అగ్రవర్ణాల వారు అడ్డుకున్నారని పలువురు బీసీ సంఘాల నాయకులు విమర్శించారు. రాఽజ్యాధికారం అగ్రవర్ణాల చేతిలో ఉన్నంత కాలం బహుజనులు బానిసలుగానే ఉంటారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గోకుల్ కృష్ణ, జిల్లా అధ్యక్షుడు పట్లోళ్ల మల్లికార్జున పాటిల్, ముఖ్య సలహాదారులు చంద్రయ్య స్వామి తదితరులు పాల్గొన్నారు.
బీసీ సంక్షేమ సంఘం
రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుగౌడ్