
ప్రత్యేక కార్యాచరణతో కేసుల ఛేదన
నారాయణఖేడ్: ప్రత్యేక కార్యచరణతో కేసుల ఛేదిస్తూ ప్రతీ కేసులోనూ నాణ్యమైన విచారణ చేసి బాధితులకు అండగా నిలవాలని జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ సూచించారు. ఖేడ్ పోలీస్‌స్టేషన్‌ను బుధవారం ఎస్పీ పరితోశ్ పంకజ్ తనిఖీ చేశారు. ఠాణా ఆవరణలో మొక్కనాటి నీళ్లుపోశారు. ఠాణా పరిసరాల శుభ్రత, సిబ్బంది కిట్ ఆర్టికల్స్, కేసుల్లో సీజ్ చేసిన వాహనాలు, ఠాణా రికార్డులను తనిఖీ చేసి విచారణలో ఉన్న కేసుల వివరాలను ఖేడ్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి, సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్సై విద్యాచరణ్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...విచారణలో సందేహాలుంటే విచారణ సపోర్ట్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలన్నారు. నేరాలు జరిగిన ప్రాంతాలను స్టేషన్ పార్ట్–11 మ్యాప్‌లో నమోదు చేయాలని సూచించారు. ఆస్తి సంబంధిత నేరాలు జరుగుతున్న ప్రాంతాలను క్రైమ్ హాట్ స్పాట్‌గా గుర్తించి నిఘా కట్టుదిట్టం చేయాలన్నారు. రౌడీషీటర్ల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించి వాహనాల వేగం అదుపునకు ర్యాంబుల్ స్ట్రిప్స్, ఇసుకడ్రమ్ములు, సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. నేరాల అదుపు, కేసుల ఛేదనలో ఉపయోగపడే సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలని ఎస్పీ చెప్పారు.
ఎస్పీ పరితోశ్ పంకజ్