
అంకితభావంతో పనిచేయాలి: ఎస్పీ
హత్నూర పీఎస్ ఆకస్మిక తనిఖీ
హత్నూర (సంగారెడ్డి): విధుల పట్ల అంకితభావంతో పనిచేయాలని జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ పేర్కొన్నారు. హత్నూర పోలీస్‌స్టేషన్‌ను ఆయన మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటిన అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసిన ప్రతి పోలీసుకు గుర్తింపు లభిస్తుందన్నారు. సిబ్బందికి విధుల పరంగా వ్యక్తిగతంగా ఎలాంటి సమస్యలు వచ్చినా ఎస్పీ కార్యాలయంలో తను నేరుగా కలవచ్చని సూచించారు. పోలీస్ స్టేషన్ రికార్డులు మెయింటెనెన్స్ బాగుందని ఎస్‌ఐ శ్రీధర్‌రెడ్డితోపాటు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. సైబర్ నేరాలపై విద్యార్థులకు, ప్రజలకు అవగాహన పెంచాలని తెలిపారు. ఎప్సీ పరితోశ్ వెంట డీఎస్పీ ప్రభాకర్, సీఐ నయీముద్దీన్, ఎస్సై శ్రీధర్‌రెడ్డి, సీసీ వినయ్ సిబ్బంది ఉన్నారు.