
రేషన్‌దుకాణం తనిఖీ చేసిన సబ్ కలెక్టర్
నారాయణఖేడ్: ఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని 53వ నంబరు రేషన్ దుకాణాన్ని స్థానిక సబ్ కలెక్టర్ ఉమాహారతి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణం ఎదుట గోడపై ఏర్పాటుచేసిన నిల్వలపట్టిక బోర్డు, దుకాణంలో తూకపు యంత్రం, రేషన్ సరుకులు నిల్వ ఉంచే చోటును పరిశీలించారు. దుకాణం పరిధిలో రేషన్ లబ్ధిదారుల సంఖ్య, సరఫరా అయ్యే సరకులు తదితర విషయాలను డీలరు సంతోషిరాణిని అడిగి తెలుసుకున్నారు. దుకాణాన్ని శుభ్రంగా ఉంచి లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. ఆమె వెంట పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దారు మహేశ్, ఆర్‌ఐ మాధవరెడ్డి, గ్రామ పాలనాధికారి సుధాకర్ ఉన్నారు.