
శ్రీకృష్ణాష్టమి వేడుక ప్రధానం
సంప్రదాయ వేషధారణలో కాయితీ లభాణీ పురుషులు
వీరి ప్రధాన పండుగలో శ్రీకృష్ణాష్టమిని ఘనంగా నిర్వహిస్తారు. విజయదశమి వేడుక సైతం అందరితో పాటు జరుపుకోకుండా దసరా ముందు వచ్చే మంగళవారం నిర్వహించడం ఆనవాయితీ. వర్షాకాలం ఆరంభంలో యువతులు తీజ్ ఉత్సవం జరుపుకుంటారు. సంప్రదాయ వేషధారణలో మహిళలు, పురుషులు బృందాలుగా నృత్యాలు చేస్తారు. శ్రీకృష్ణుని వంశస్తులుగా చెప్పుకొనే కాయితీ లభాణీలు మద్యం తాగరు. మాంసాహారం భుజించరు. నియమ, నిష్టలకు పెట్టింది పేరుగా ఉంటుంది వీరి జీవన విధానం.