
బోల్తా పడిన కోడిగుడ్ల వాహనం
కొండపాక(గజ్వేల్): కోడిగుడ్ల వాహనం రాజీవ్ రహదారిపై బోల్తా పడింది. ఈ ఘటన కుకునూరుపల్లి గ్రామ శివారులో శనివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా గొల్లపల్లిలోని పౌల్ట్రీఫాం నుంచి టాటా ఏసీ వాహనంలో కోడిగుడ్లను హైదరాబాద్‌కు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో కుకునూరుపల్లి శివారులో అదుపు తప్పి వాహనం సుమారు 20 గజాల దూరం వరకు డివైడర్‌ను ఢీకొట్టుకుంటూ వెళ్లి రోడ్డుపై అడ్డంగా బోల్తా పడింది. దీంతో వాహన డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. కోడిగుడ్లు పగిలి రోడ్డుపై పడటంతో ద్విచక్ర వాహనదారుడు అందులోంచి వెళ్తూ స్కిడ్ అయి పడగా గాయాలు సైతం అయ్యాయి. సుమారు 15 నిమిషాల పాటు వాహనాలు నిలిపోయాయి. పోలీసులు కోడిగుడ్ల వాహనాన్ని రోడ్డు పైనుంచి తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. కాగా ఇదే ప్రదేశంలో ఇటీవల ద్విచక్ర వాహన దారుడు డివైడర్‌ను ఢీకొని మృతి చెందాడు. ఈ ప్రదేశాన్ని డేంజర్ జోన్‌గా గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరారు.
డ్రైవర్, మరో వ్యక్తికి స్వల్ప గాయాలు