
ఖాళీలు భర్తీ చేయాలి
జహీరాబాద్ టౌన్: ఖాళీగా ఉన్న ఎంఈఓ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్టీయూ) జిల్లా అధ్యక్షుడు సయ్యద్ సాబేర్ కోరారు. శనివారం పట్టణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లా డారు. చాలాకాలంగా ఇన్‌చార్జి ఎంఈఓలుగా కొనసాగుతున్నారని, దీని వల్ల సబ్జెక్టుల కొరత ఏర్పడుతుందన్నారు. ఖాళీలను సీనియర్ ప్రధానోపాధ్యాయులతో పదోన్నతి ద్వారా భర్తీ చేయాలన్నారు. నూతన పీఆర్‌సీ అమలుచేసి రెండు డీఏలను వెంటనే ప్రకటించాలన్నారు. యూనియన్ నాయకులు రమణకుమార్, బషీర్ అహ్మద్, బూర్ఖన్ పాల్గొన్నారు.
4,334 కేసులు పరిష్కారం
జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర
సంగారెడ్డి టౌన్: రాజీ మార్గంతోనే కేసులు పరిష్కారం అవుతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర అన్నారు. శనివారం జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. చాలా కాలంగా పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉన్న కేసులను రాజీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమస్యలను సామరస్యంగా చర్చించుకొని పరిష్కరించుకోవాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 4,334 కేసులు పరిష్కారం అయ్యాయని తెలిపారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.