
గురువులు.. సమాజ నిర్దేశకులు
పటాన్‌చెరు: దేశ భవిష్యత్తు నిర్మాణం తరగతి గదిలోనే జరుగుతుందని.. అలాంటి గురువులను గత 24 సంవత్సరాలుగా ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి గౌరవించడం అభినందనీయమని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు కొనియాడారు. శనివారం డివిజన్ పరిధిలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో నియోజకవర్గ పరిధిలోని ప్రైవేటు పాఠశాలలో ఉత్తమ ఉపాధ్యాయులగా ఎంపికై న వారిని ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయ వృత్తి నుంచి ప్రారంభమై, నేడు పార్లమెంటు సభ్యుడి వరకు ఎదగడం వెనక తనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువుల కృషి ఉందని ప్రశంసించారు. ప్రస్తుత సమాజంలో మొబైల్ వాడకం అత్యంత ప్రమాదకరంగా మారిందని తెలిపారు. ప్రతి ఉపాధ్యాయుడు తరగతి గదిలో విద్యార్థి చదువుతో పాటు మానసిక ప్రవర్తనను గమనించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నవ సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులని కొనియాడారు. కార్పొరేట్ పాఠశాలల ద్వారా పోటీ ఉన్నప్పటికీ, ప్రైవేట్ పాఠశాలలు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయని అభినందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, వివిధశాఖల అధికారులు, ప్రైవేట్ పాఠశాలల సంక్షేమ సంఘం ప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మెదక్ ఎంపీ రఘునందన్‌రావు