
కీచక టీచర్‌ను కఠినంగా శిక్షించాలి
సంగారెడ్డి ఎడ్యుకేషన్: విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఇంగ్లిష్ టీచర్ వినయ్‌ను కఠినంగా శిక్షించాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి రెహమాన్ డిమాండ్ చేశారు. మంగళవారం సీపీఐ నాయకులు సంగారెడ్డి డీఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, సంస్థ యాజామాన్యానికి సంబంధించిన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా రెహమాన్ మాట్లాడుతూ... శాంతినగర్‌లో గల సెయింట్ ఆంథోనీస్ విద్యాసంస్థ గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గతంలోనూ అదే పాఠశాలలో ఇలాంటి ఘటన జరిగిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు గంగయ్య, పాండు, మహబూబ్, మున్నా, అసద్, శ్రీనివాస్, బాబు జగ్జీవన్ రామ్, సమతా సైనిక్ దళ్ జిల్లా కార్యదర్శి వేణుగోపాల్ పాల్గొన్నారు.