
ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే చర్యలు
కంది(సంగారెడ్డి): ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ రవికుమార్ హెచ్చరించారు. మంగళవారం మండలంలోని వడ్డెను గూడాతండా శివారులో కబ్జాకు గురైన నక్షబాటను పోలీసులు సహకారంతో తిరిగి ఏర్పాటు చేశారు. ఈనెల 29న పొలాలకు వెళ్లే నక్షబాటను కొందరు కబ్జా చేశారని ఆరోపిస్తూ తండావాసులు రైతులు ఆందోళనకు దిగారు. ఈ విషయమై ఫిర్యాదు అందడంతో స్పందించిన తహసీల్దార్ పోలీసుల సహకారంతో జేసీబీలతో నక్షబాటను తిరిగి ఏర్పాటు చేయించారు. దీంతో తమ పొలాలకు వెళ్లేందుకు బాటను ఏర్పాటు చేయించిన తహసీల్దార్‌కు తండావాసులు, రైతులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌ఐ రంగయ్య, సర్వేయర్ కోటేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.
తహసీల్దార్ రవికుమార్