
జాతీయ స్థాయి శిక్షణకు ఉపాధ్యాయుడు ఎంపిక
మర్కూక్(గజ్వేల్): మండలంలోని దామరకుంట జెడ్పీ ఉన్నత పాఠశాల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు చిన్న బ్రహ్మయ్య జాతీయ స్థాయి వర్క్‌షాప్ శిక్షణకు ఎంపికయ్యారని విద్యాధికారి వెంకట్ రాములు తెలిపారు. మే నెలలో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల భవనంలో ప్రదర్శించిన ఉత్తమమైన బోధన పద్ధతుల ద్వారా ఆయన ఎన్నికయ్యారు. ఢిల్లీలో నిర్వహించే జాతీయ స్థాయి నూతన విద్యావిధానంపై వర్క్‌షాప్, శిక్షణకు వెళ్లనున్నారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లోని ఎస్‌సీఈఆర్‌టీ భవనంలో డైరెక్టర్ రమేశ్ ప్రొసీడింగ్ పత్రాన్ని ఆయనకు అందజేశారు. ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఢిల్లీ సీసీఆర్టీ భవనంలో శిక్షణ పొందనున్నారని రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ సంస్థ సెక్రెటరీ నికోలస్ , జిల్లా విద్యాధికారి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారన్నారు.
నర్మెటలో కొత్తరాతి
యుగం పనిముట్టు
నంగునూరు(సిద్దిపేట): నర్మెటలో మంగళవారం కొత్తరాతి యుగపు పనిముట్టు లభ్యమైనట్లు ఔత్సాహిక చరిత్ర పరిశోధకుడు కొలిపాక శ్రీనివాస్ తెలిపారు. గ్రామంలోని పాటిగడ్డలో గతంలో ఆదిమానవుని అవశేషాలు అభ్యం కాగా అదే ప్రాంతంలో నేడు క్రీసు్‌త్ పూర్వం 2500 కిందటి రాతి పనిముట్టు దొరికిందన్నారు. దీనిని పరిశీలించగా త్రిభుజాకారంలో ఉన్న రాతి మధ్యలో హోల్ ఉందని, వస్తువుల బరువు తూకం వేసేందుకు ఉపయోగించినట్లు తెలుస్తోందని వివరించారు.
బైండోవర్ ఉల్లంఘన..
జరిమాన
బెజ్జంకి(సిద్దిపేట): మండలంలోని చిలాపూర్‌పలెల గ్రామానికి చెందిన దండ్ల రేణుక బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించారు. దీంతో తహసీల్దార్ చంద్రశేఖర్ ఆదేశాల మేరకు రూ.30 వేల జరిమాన విధించినట్లు ఎకై ్సజ్ సీఐ పవన్ తెలిపారు. గతంలో గుడుంబా విక్రయించినందుకు బైండోవర్ చేయగా నిబంధనలు అతిక్రమించి మళ్లీ విక్రయించడంతో జరిమాన విధించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు రూప, దామోదర్ తదితరులు పాల్గొన్నారు.
పేకాటరాయుళ్ల అరెస్ట్
నిజాంపేట(మెదక్): ఓ దాబాలో పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులతో పాటు యాజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మండల పరిధిలోని కల్వకుంట గ్రామంలో చోటు చేసుకుంది. మంగళవారం పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారంతో ఎస్‌ఐ రాజేశ్ సిబ్బందితో కలిసి దాబాపై దాడి చేశారు. యాజమాని గన్నరం వెంకటగౌడ్‌తోపాటు కుంచన రాజు, వెంకటాపూర్ గ్రామానికి చెందిన కాస చంద్రం, కుక్కుడు నాగరాజు, శివుల్ల నర్సింహులు, కాస కై లాష్‌లను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 10,170, ఐదు ద్విచక్ర వాహనాలు, ఐదు సెల్‌ఫోన్స్, పేకాట ముక్కలను స్వాధీనం చేసుకుని, ఆరుగురిపై కేసు నమోదు చేశారు.
కుటుంబ సమస్యలతో ఆత్మహత్యాయత్నం
రామాయంపేట(మెదక్): పట్టణానికి చెందిన విఠల్ నాయక్ కుటుంబ సమస్యలతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. పట్టణంలో కూరగాయల వ్యాపారం చేసే విఠల్ గతంలో పలుమార్లు ఆత్మహత్యకు యత్నించాడు. మంగళవారం పట్టణ శివారులో వంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకొని తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని చికిత్స నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ బాల్‌రాజ్ తెలిపారు.
గంజాయి కేసులో
మహిళకు జైలు
జహీరాబాద్ టౌన్: గంజాయి సాగు కేసులో కోర్టు మహిళకు జైలుశిక్షతో పాటు జరిమాన విధించింది. ఎకై ్సజ్ సీఐ శ్రీనివాస్‌రెడ్డి వివరాల ప్రకారం... ఝరాసంగం మండలం ఇస్లాపూర్ గ్రామానికి చెందిన బోయిని సావిత్రమ్మ(45) సొంత వ్యవసాయ భూమిలో గంజాయి సాగు చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు 2020లో ఎకై ్సజ్ అధికారులు దాడి చేసి 175 గంజాయి మొక్కలను ధ్వంసం చేసి ఆమైపె కేసు నమోదు చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేశ్వర్ బలంగా వాదనలు వినిపించారు. కేసు పూర్వపరాలు విన్న తరువాత జిల్లా అదనపు న్యాయమూర్తి కె.జయంతి నిందితురాలికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 25 వేల జరిమాన విధిస్తూ తీర్పునిచ్చారు.

జాతీయ స్థాయి శిక్షణకు ఉపాధ్యాయుడు ఎంపిక