
పరిశ్రమలో లీకై న కెమికల్
ఉత్పత్తులు నిలిపివేయండి..
మనోహరాబాద్(తూప్రాన్): ఓ పరిశ్రమలో కెమికల్ గ్యాస్ లీకై ఎనిమిది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. కాగా అప్పటికే సిబ్బంది అప్రమత్తమై లీక్‌ను ఆపివేశారు. ఈ ఘటన మనోహరాబాద్ మండలం కూచారం గ్రామ శివారులోని పరిశ్రమల వాడలో గల శ్రీయాన్స్ ల్యాబ్ పరిశ్రమలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... శ్రీయాన్స్ ల్యాబ్‌లో వ్యవసాయానికి ఉపయోగపడే కెమికల్స్‌ను తయారు చేస్తుంటారు. ఈ క్రమంలో మంగళవారం కెమికల్ సిలిండర్ నుంచి ట్రాన్స్‌ఫర్ చేయడానికి పైపు బిగించే క్రమంలో లీకై నట్లు కార్మికులు తెలిపారు. అదే సమయంలో విద్యుత్ ఆగిపోవడంతో లీక్‌ను నియంత్రించడంతో ఆలస్యం జరిగినట్లు పేర్కొన్నారు. దీంతో అక్కడ పని చేస్తున్న ప్రభాకర్, యోగేశ్ రాయ్, వెంకటరమణ, కేశవ, మహేందర్‌లతోపాటు మరో ముగ్గురు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడ్డారు. కాగా అప్రమత్తమైన సిబ్బంది లీక్‌ను ఆపివేయడంతో కొద్దిసేపటి తర్వాత వాసన నిలిచిపోయినట్లు సిబ్బంది తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న మనోహరాబాద్, తూప్రాన్ నుంచి 108 అంబులెన్సు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని కార్మికులకు ప్రథమ చికిత్స అందించారు. పరిశ్రమలో ప్రమాద నివారణకు సంబంధించిన పరికరాలుండటంతో పరిశ్రమ వద్ద ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. పరిశ్రమలో పని చేస్తున్న వారికి ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో కార్మికులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
కాలుష్య నియంత్రణ
మండలి ఉత్తర్వులు
సనత్‌నగర్: క్లోరిన్ గ్యాస్ లీకై న ఘటనలో మనోహరాబాద్ మండలం కుచారం గ్రామం ఇండస్ట్రీయల్ పార్కులో కొనసాగుతున్న శ్రీయాన్స్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ) స్పందించింది. ఆ కంపెనీ కార్యకలాపాలను నిలివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం ఉదయం 9.30 గంటలకు పరిశ్రమ నుంచి గ్యాస్ లీకేజీ కారణంగా వాయు కాలుష్యం, దుర్వాసన వస్తుందని సమీపంలో ఉన్న పలు పరిశ్రమల నుంచి బోర్డుకు ఫిర్యాదులు అందాయి. వెంటనే టీజీపీసీబీ ఆర్‌సీపురం అధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించి పరిశ్రమతోపాటు పరిసరాలను పరిశీలించారు. శ్రీయాన్స్ ల్యాబ్స్ ప్రాంగణంలో సిలిండర్ నుంచి గ్యాస్ లీకై నట్లుగా గుర్తించారు. ఇసుకలో, అలాగే చుట్టుపక్కల గాలిలోకి గ్యాస్ వ్యాపించినట్లు నిర్ధారించారు. లీకేజీ సమయంలో పరిశ్రమ డీజిల్ జనరేటర్ సెట్ పలు భద్రతా లోపాలతో వెంటనే పనిచేయలేదన్నారు. పరిశ్రమ ముందు జాగ్రత్త, నియంత్రణ చర్యలు అమలు చేయడంలో విఫలమైనట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటన తీవ్రత దృష్ట్యా శ్రీయాన్స్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్–2 ఉత్పత్తులను నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.
8 మంది కార్మికులకు అస్వస్థత
కూచారం పరిశ్రమల వాడలోని
శ్రీయాన్స్ ల్యాబ్‌లో ఘటన

పరిశ్రమలో లీకై న కెమికల్