
తండ్రి టైలరింగ్.. కొడుకు ఎస్‌ఐ
దుబ్బాక పట్టణానికి చెందిన ఐరేని శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మీ దంపతుల కుమారుడు భార్గవ్ గౌడ్. నా తండ్రి టైలరింగ్ చేస్తూ కుటంబాన్ని పోషించాడు. గతంలో అస్సాం రైఫిల్‌మెన్‌గా, సీఆర్‌పీఎఫ్ ఎస్‌ఐ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాను. ఆర్మీ అధికారి కావాలని కష్టపడి చదివాను. పోలీస్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఎస్‌ఐ పరీక్షకు సిద్ధమై జాబ్ సాధించి కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట ఎస్‌ఐగా సేవలందిస్తున్నా. ఇటు ఎస్‌ఐగా పనిచేస్తూనే నాకు సమయం దొరికినప్పుడు అసిస్టెంట్ కమాండెంట్ ఆర్మీ పరీక్షకు సన్నద్ధమవుతున్నా.
– భార్గవ్, నాగిరెడ్డి పేట ఎస్‌ఐ