
అర్హులందరికీ రేషన్‌కార్డులు
జహీరాబాద్: అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులను అందజేస్తామని జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ స్పష్టం చేశారు. శనివారం పస్తాపూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు రేషన్ కార్డులకు సంబంధించిన ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే రేషన్ కార్డులు ఇచ్చారని, తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రేషన్ కార్డులను అందజేస్తున్నారని వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందన్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలో కొత్తగా 4,180 మందికి రేషన్ కార్డులను ఇవ్వడంతోపాటు అదనంగా కొత్తగా 15,730 మందిని రేషన్ కార్డుల జాబితాలో చేర్చామని తెలిపారు.
జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్