
అంకితభావంతో విధులు నిర్వర్తించాలి
జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్
సంగారెడ్డి క్రైమ్: పోలీసులు అంకితభావంతో విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ పేర్కొన్నారు. సంగారెడ్డి పట్టణ పోలీసు స్టేషన్‌ను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. సిబ్బంది పరేడ్‌ను, బ్యారెక్స్‌ను ఆయన పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలోని స్వాధీనం చేసుకున్న వాహనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పరితోశ్ పంకజ్ మాట్లాడుతూ...ప్రతి రికార్డును ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. టీఎస్–కాప్, హెచ్‌ఆర్‌ఎంఎస్, ఈ–సాక్ష్య, సీఈఐఆర్, సీడీఆర్, సీఈఐఆర్ పోర్టల్, పోర్టబుల్ ఫింగర్ ప్రింట్ డివైజ్ వంటి అన్ని రకాల సాఫ్ట్‌వేర్ అప్లికేషన్లపై పూర్తిస్థాయిలో పట్టు సాధించి నేరాల నియంత్రణలో కీలకంగా వ్యవహించాలని సిబ్బందికి ఆదేశించారు.