
అలోవెరా సాగుతో అధిక ఆదాయం
కౌడిపల్లి(నర్సాపూర్): అలోవెరా పంట సాగు తక్కువ ఖర్చుతో అధిక ఆదాయం పొందవచ్చని కేవీకే గృహవిజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ భార్గవి తెలిపారు. మంగళవారం మండలంలోని తునికి వద్దగల కేవీకేలో ఏఏఏఆర్‌ఎం ఆధ్వర్యంలో ఎస్సీ సబ్‌ప్లాన్‌లో భాగంగా ఎస్సీ మహిళా రైతులకు సేంద్రియ పద్ధతిలో అలవెరా, చిరుధాన్యాల సాగు, వాటి ఉత్పత్తులపై శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... తక్కువ నీరు, తక్కువ ఖర్చుతో పడావు భూముల్లో అలవెరా సాగు చేయవచ్చన్నారు. సబ్బుల తయారీ, జ్యూస్, ఇతర సౌందర్య సాధనాలతోపాటు ఇతర ఉత్పత్తులలో ఉపయోగిస్తారని చెప్పారు. అనంతరం క్షేత్రస్థాయిలో అలవెరా పంట సాగును పరిశీలించి శిక్షణనిచ్చారు. ఈ కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు, మహిళా రైతులు పాల్గొన్నారు.
కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ భార్గవి