
సిగాచీ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి
సంగారెడ్డి ఎడ్యుకేషన్: సిగాచీ పరిశ్రమ యాజమాన్యాన్ని తక్షణమే అరెస్ట్ చేయడంతో పాటు పరిశ్రమలలో ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం అదనపు కలెక్టర్ చంద్రశేఖర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో వరుస ప్రమాదాలు జరిగి కార్మికులు చనిపోతున్నా ప్రభుత్వ అధికారులు స్పందించటం లేదన్నారు. ఇప్పటికై నా స్పందించి ముందస్తుగా తనిఖీలు చేపట్టి ప్రమాదాలు జరగకుండా నివారించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మాణిక్యం, నాయకులు సాయిలు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.