
18న జిల్లాకు బీజేపీ చీఫ్ రాక
నర్సాపూర్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఈనెల 18న జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఎంపీ రఘునందన్‌రావు సోమ వారం తన క్యాంపు కార్యాలయంలో ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు మొదటి సారి జిల్లాకు వస్తున్నందున ఆయన పర్యటనను విజయవంతం చేయా లని సూచించారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్, మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిన్న రమేష్‌గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఎల్‌ఎన్‌రెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కాశీనాథ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.