
మా ఇంటి తోట
చేగుంట(తూప్రాన్): మండలంలోని వడి యారం గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ కృష్ణవేణి ఇంట్లోనే పలు రకాల మొక్కలు పెంచుతున్నారు. మొక్కల పెంపకంపై ఆసక్తితో ఆమె ఐదేళ్లుగా ఇంటి ఆవరణలో మామిడి, జామ, కరివేపాకు, మల్లె చెట్టు, శ్రీగంధం, ఎర్రచందనం, లక్ష్మణఫలం, బిర్యానీ ఆకు, తైవాన్ మామిడి, తైవాన్ జామ, అశ్వగంధం, అల్లనేరేడు, అవకాడో, అంజీర్ మొక్కలను నాటారు. వీటితోపాటు అంతర పంటగా పసుపు, వేరుశనగ పండిస్తున్నారు. ఎలాంటి రసాయనాలు వాడకుండా మొక్కలను సేంద్రీయ ఎరువులతో మాఇంటి తోటలో పెంచుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.