
విరివిగా మొక్కలు పెంచుతున్న వృక్ష ప్రేమికులు పెంపకంపై ఇ
అడవులు అంతరించిపోతున్న తరుణంలో పలువురు వృక్ష ప్రేమికులు సొంతంగా మొక్కలు నాటుతూ పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నారు. భవిషత్ తరాలకు మంచి వాతావరణం అందించడానికి తమ ఇంటి పరిసరాలు, పని చేసే చోట, ఖాళీ స్థలాల్లో విరివిగా మొక్కలు నాటుతున్నారు. విత్తన బంతులను తయారు చేసి చల్లుతున్నారు. వృక్షాల ప్రాముఖ్యత గూర్చి సమాజంలో పలువురికి అవగాహన కల్పిస్తూ పలువురు మొక్కలు నాటేలా కృషి చేస్తున్న హరిత ప్రేమికులపై సాక్షి సండే స్పెషల్.
ఉపాధ్యాయుడి ఇల్లు.. ఉద్యాన వనం
చేర్యాల(సిద్దిపేట): పట్టణ కేంద్రంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన అంబాల వెంకటేశ్‌గౌడ్, ప్రస్తుతం చుంచనకోట ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎంగా విధులు నిర్వహిస్తున్నాడు. మొక్కలంటే మక్కువ. తన ఇంటినే ఉద్యానవనంగా మార్చుకున్నాడు. ఇంటిలో నాటిన మొక్కలకు నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో కొంత సమయం కేటాయించి వాటిని సంరక్షిస్తున్నాడు. ఖాళీ స్థలంలో మొక్కలు నాటి పెంచుతుండటంతో ఇంటి పరిసరాలు ఉద్యానవనాన్ని తలపిస్తున్నాయి. ఎర్రచందనం, శ్రీగంధం, మూడు రకాల మామిడి, రెండురకాల ఉసిరి మొక్కలతో కలుపుకొని మొత్తం 15 రకాల పండ్ల జాతి, 8 రకాల పూల మొక్కలు, కొన్ని రకాల తీగజాతి కూరగాయ తోటలు పెంచుతున్నాడు. పండ్లు, పూలు, నీడనిచ్చే, వాటిని కలుపుకుని మొత్తం 200 రకాలు మొక్కలు ఆ వనంలో ఉన్నాయి. గతంలో కేరళకు వెళ్లిన ఆయన అక్కడ ఏ ఇంటి ఆవరణ చూసినా వనంలా కనిపించడంతో అలా తన ఇంటిని కూడా ఉద్యానవనంగా మార్చుకున్నాడు.

విరివిగా మొక్కలు పెంచుతున్న వృక్ష ప్రేమికులు పెంపకంపై ఇ

విరివిగా మొక్కలు పెంచుతున్న వృక్ష ప్రేమికులు పెంపకంపై ఇ