
కోటి మొక్కలు నాటడమే సంకల్పం
నారాయణఖేడ్: మనుషులు చెట్లను ఇష్టానుసారంగా నరికి వేస్తుండటంతో ప్రకృతి గతి తప్పిందని భావించాడు. కోటి మొక్కలు నాటాలని పదేళ్ల క్రితం దీక్ష బూనాడు. ఆయనే సంగారెడ్డి జిల్లా నాగల్‌గిద్ద మండలం ముక్టాపూర్ గ్రామానికి చెందిన పాలడుగు జ్ఞానేశ్వర్. కోటి మొక్కలు నాటే వరకు పాదరక్షలు ధరించబోనని శపథం చేశాడు. ఇప్పటి వరకు 3.50లక్షల మొక్కలను అడవులు, నదీ పరివాహక ప్రాంతాల్లో, దేవాలయ ప్రాంగణాలు, పాఠశాల ఆవరణలో నాటారు. విత్తన బంతులు తయారు చేసి నర్సాపూర్, మెదక్, మంజీరా నదికి ఇరువైపులా తాను చల్లడమే కాకుండా విద్యార్థులతో చల్లించారు. జ్ఞానేశ్వర్‌కు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థ మొక్కలను అందిస్తుంది. ఈ పర్యావరణ ప్రేమికుడికి ‘సాక్షి’ దినత్రిక ఎక్స్‌లెన్స్ అవార్డును గవర్నర్ విశ్వభూషన్ హరిచందర్ చేతులమీదుగా, భారత్ యువ పురస్కార్, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థ ద్వారా ఎర్త్ లీడర్ అవార్డులతోపాటు సత్కారాలు పొందాడు.
మొక్కలు నాటుతున్న జ్ఞానేశ్వర్

కోటి మొక్కలు నాటడమే సంకల్పం