మహిళా శక్తి సంబరాలు | - | Sakshi
Sakshi News home page

మహిళా శక్తి సంబరాలు

Jul 11 2025 12:50 PM | Updated on Jul 11 2025 12:50 PM

మహిళా

మహిళా శక్తి సంబరాలు

సంగారెడ్డిటౌన్‌: గ్రామీణ ప్రాంతంలోని మహిళలు వ్యాపారవేత్తలుగా అభివృద్ధి చెందేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ఇందులోభాగంగానే రాష్ట్ర ప్రభుత్వం మహిళలను కోటీశ్వరులుగా చేయాలని లక్ష్యంతో వివిధ రకాల పథకాల రూపంలో రుణాలను అందజేస్తూ అభివృద్ధికి సహకరిస్తున్నారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, సీ్త్ర నిధి రుణాలను అందజేస్తున్నారు. గ్రామాల్లోని మహిళలు ఆర్థికంగా స్థిరపడేలా మహిళా సంఘం సభ్యులకు ప్రభుత్వం రాయితీ రూపంలో రుణాలను అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు. గతేడాది రూ.911 కోట్ల రుణాలను అందజేశారు. మహిళా సంఘాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పేరుతో అభివృద్ధి పనులను చేపడుతుంది. ఇందులోభాగంగా మండల, గ్రామస్థాయిలలో సమావేశాలను నిర్వహించారు. ఈ నెల 12 నుంచి 18 వరకు నియోజకవర్గ స్థాయిల్లో కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, సోలార్‌ పవర్‌ ప్లాంట్లు ఏర్పాటు, పెట్రోల్‌ పంపుల నిర్వహణ, చేపల పెంపకం, పెరటి కోళ్ల పెంపకం, కిరాణా దుకాణాలు, టెంట్‌ హౌస్‌, పాలడైరీ, పిండిగిర్నీలు ఏర్పాట్లకు ప్రోత్సహిస్తూ మహిళల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో 25 మండలాలలో 695 గ్రామ సంఘాలు ఉండగా అందులో 18,448 సంఘాలు వున్నాయి. జిల్లావ్యాప్తంగా 1,94,013 మహిళ సంఘం సభ్యులు ఉన్నారు. ఆన్‌లైన్‌ పద్ధతిలో నెలనెలా వాయిదాల రూపంలో డబ్బులు చెల్లిస్తూ వివిధ రకాలుగా లబ్ధి పొందుతున్నారు.

మహిళా సంఘాలలో కొత్తగా ఇవి...

● ఈ ఏడాది నుంచి దివ్యాంగ మహిళలకు గ్రామాలలో ఐదుమందికి కలిసి ఒక గ్రూపును ఏర్పాటు చేస్తున్నారు.

● 14 నుంచి 18 ఏళ్ల వయసు కలిగిన యువతులకు గ్రూపులను ఏర్పాటు చేస్తున్నారు.

● 18 నుంచి 60 ఏళ్లున్న మహిళలకు సంఘంలో లేని వారికి సభ్యత్వాలు కలిగించే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

● 60 ఏళ్లు పైబడిన వారికి కొత్తగా గ్రూప్‌ను కూడా ఏర్పాటు చేయడానికి సన్నాహమవుతున్నారు.

● నిరక్షరాస్య మహిళలను గుర్తించి ప్రత్యేకంగా చదివించేందుకు మహిళా సంఘంలోని సభ్యులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

● మండలానికి ఒకటి చొప్పున ఆర్టీసీ బస్సులను త్వరలోనే అందజేయనున్నారు.

● అమ్మ ఆదర్శ పాఠశాలలో మహిళా సంఘాల సభ్యుల ద్వారా పాఠశాలను అభివృద్ధి చెందేలా కృషి చేశారు.

● గృహ నిర్మాణాలకు కావలసిన ఇటుకలను, కార్‌ డ్రైవింగ్‌ శిక్షణను అందించి మహిళల కోసం మరింత ఉపాధి కల్పిస్తున్నారు.

● జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులకు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు గ్రామీణ అభివృద్ధి సంస్థ, మహిళా సమైక్యాలు మరింత కృషి చేస్తున్నాయి.

● 2025–26 గాను రాష్ట్ర ప్రభుత్వం రూ.930 కోట్ల రుణాలను లక్ష్యంగా ఇచ్చింది.

● మహిళలకు రుణాలు అందిస్తూ వారు సకాలంలో చెల్లించుకుంటూ అభివృద్ధిలో ముందుకెళ్తున్నారు.

● గ్రామ, మండల సమైక్య సంఘాల ఆధ్వర్యంలో వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహిస్తూ జిల్లాలో మహిళా శక్తి సంబరాలను నిర్వహిస్తున్నారు.

చిరు వ్యాపారం సాగిస్తున్నా

హిళా సంఘంలో రుణాన్ని తీసుకుని పాపడ్ల మెషీన్‌ను కొనుగోలు చేశాను. వాటిని తయారు చేస్తూ అమ్ముకుంటూ మంచి వ్యాపారాన్ని సాగిస్తున్నాను. వ్యాపారంలో లాభాలు పొందుతున్నాను.

–అంబిక, ఇస్మాయిల్‌ ఖాన్‌ పేట్‌ గ్రామం, సంగారెడ్డి మండలం

కుట్టు మెషీన్‌ నడిపిస్తున్నా

సంఘం ద్వారా బ్యాంకులో రుణం తీసుకుని బట్టలు కుట్టడంతోపాటు మహిళలకు టైలరింగ్‌ శిక్షణనిచ్చి ఆదాయాన్ని పొందుతున్నాను. నాతోపాటు మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నా.

–సంతోషి, గుమ్మడిదల మండలం

వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం

జిల్లాలోని మహిళా సంఘం సభ్యులను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కలెక్టర్‌ ఆదేశాల మేరకు, జిల్లా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, సీ్త్ర నిధి, బ్యాంకు లింకేజీల ద్వారా రుణాలను అందిస్తున్నాం.

–జ్యోతి, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి

పురుషులతో సమానంగా వేతనాలు

పురుషులతో సమానంగా పనిచేస్తూ వేతనాలను తీసుకుంటున్నాం. మహిళా సంఘం ద్వారా జిల్లా కేంద్రంలోని సంగారెడ్డిలో పెట్రోల్‌ బంకును ఏర్పాటు చేశారు. 16 మంది మహిళలం ఉపాధి పొందుతున్నాము.

–సుకన్య, నలంద నగర్‌ సంగారెడ్డి

ఈనెల 18 వరకు వేడుకలు

మహిళలకు రూ.930 కోట్ల రుణాల లక్ష్యం

లబ్ధి పొందుతున్న మహిళా సంఘం సభ్యులు

మహిళా శక్తి సంబరాలు1
1/4

మహిళా శక్తి సంబరాలు

మహిళా శక్తి సంబరాలు2
2/4

మహిళా శక్తి సంబరాలు

మహిళా శక్తి సంబరాలు3
3/4

మహిళా శక్తి సంబరాలు

మహిళా శక్తి సంబరాలు4
4/4

మహిళా శక్తి సంబరాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement