
రూ.కోటి నష్టపరిహారం ఇవ్వండి
రామచంద్రాపురం(పటాన్‌చెరు): సిగాచీ పరిశ్రమ ప్రమాదంలో మృతి చెందిన, ఆచూకీలేని కార్మిక కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారం ఇవ్వాలని గురువారం తెల్లాపూర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్‌ను బీఆర్‌ఎస్ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్‌రెడ్డి, పటాన్‌చెరు మాజీ జెడ్పీటీసీ సభ్యులు శ్రీకాంత్‌గౌడ్‌లు కలసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పరిశ్రమలో జరిగిన ప్రమాద వివరాలను అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ నాయకులకు వివరించారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మిక కుటుంబాలకు నష్టపరిహారం అందించేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు ఆదర్శ్‌రెడ్డి మాట్లాడుతూ మృతి చెందిన కార్మిక కుటుంబాలకు రూ.కోటి ఇవ్వాలని లేనిపక్షంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు.