
నిధుల దుర్వియోగంపై నిలదీత
జహీరాబాద్: మండలంలోని గోవింద్‌పూర్ గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపిస్తూ ప్రజలు అధికారులను నిలదీశారు. బుధవారం గ్రామంలో ఎంపీడీఓ మహేందర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సరస్వతీ, ఆయా శాఖల అధికారులు, గ్రామ ప్రజల సమక్షంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు పంచాయతీ కార్యాలయం వద్దకు వచ్చి సర్పంచ్‌ల పదవీ కాలం ముగిసిన సమయంలో ఎంత మేర నిధులు ఉన్నాయి? పన్నుల రూపంలో, ఇతరత్రా వచ్చిన నిధులు ఎంత మేర వచ్చాయనే దానిపై వివరాలు అడిగారు. నిధులను దుర్వినియోగం చేశారని, చేయని పనులకు రికార్డులు చేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని తక్షణమే తేల్చాలని పట్టుబట్టారు. దీంతో గందరగోళం ఏర్పడింది. ఈ విషయమై ఎంపీడీఓ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ నిధుల దుర్వినియోగం జరగలేదని, వచ్ని ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. పనులు, నిధులకు సంబంధించిన లెక్కలు ఉన్నాయని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలో రూ.కోటి మేర నిధులు ఉండగా వివిధ పనులకు సంబంధించి రూ.50లక్షలు ఖర్చు చేశామని, మిగిలిన నిధులు పంచాయతీ ఖాతాలో ఉన్నట్లు వివరించారు.