నర్సాపూర్ రూరల్: ఓ యువతి అదృశ్యమైన సంఘటన నర్సాపూర్ మండలం అచ్చంపేటలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై లింగం తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చాకలి ఆంజనేయులు కూతురు సురేఖ (19) పదో తరగతి పూర్తి చేసి ఇంట్లోనే ఉంటుంది. సోమవారం ఇంటి నుంచి వెళ్లి కనిపించకుండా పోయింది. చాకలి ఆంజనేయులు అతని భార్య పోచమ్మ, ఇద్దరు కుమారులు సురేఖను ఇంటి వద్ద ఉంచి 7వ తేదీ సోమవారం ఉదయం కూలి పనులకు వెళ్లారు. పనులు ముగించుకొని ఇంటికి వచ్చేసరికి సురేఖ ఇంటివద్ద లేదు. చుట్టుపక్కలతో పాటు బంధువుల వద్ద వెతికిన ఆచూకీ లభించ లేదు. ఇంట్లో ఉన్న రూ 15 వేలు తీసుకెళ్లినట్లు తెలిపారు. తల్లి పోచమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
జేబు దొంగకు దేహశుద్ధి
నర్సాపూర్ రూరల్: జేబు దొంగను మహిళలు పట్టుకొని చితకబాదారు. ఈ సంఘటన నర్సాపూర్ బస్టాండ్‌లో మంగళవారం చోటుచేసుకుంది. నర్సాపూర్ బస్టాండ్‌లో ఓ వ్యక్తి తన ఇద్దరు కూతుర్లతో కలసి హైదరాబాద్‌కు వెళ్లే బస్సు ఎక్కుతున్నాడు. ఈ క్రమంలో జేబులో ఉన్న డబ్బులు కాజేసేందుకు ప్రయత్నిస్తున్న దుండగుడిని మహిళలు చూసి పట్టుకొని చితకబాదారు. పోలీసులకు సమాచారం ఇచ్చేలోపు అతను తప్పించుకొని పారిపోయాడు. తరచూ బస్టాండ్‌లో జేబుదొంగలు, డబ్బులతో పాటు బంగారు నగలు, సెల్‌ఫోన్లను అపహరిస్తున్న ఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయని ప్రయాణికులు వాపోతున్నారు.
యువతి అదృశ్యం