
టమాటా.. రైతులకు ఊరట
పెరుగుతున్న
ధరలు
గిట్టుబాటు అవుతున్న ధరలు
కొన్ని రోజుల నుంచి టమాట ధరలు పెరుగుతున్నాయి. ఏప్రిల్, మే నెలలో నాటిన తోటల నుంచి కోతలు వస్తున్నాయి. ప్రస్తుతం సగం కోతలు పూర్తి చేశారు. అయితే దిగుబడి అంతంత మాత్రంగా ఉంది. ధర మాత్రం ఆశాజనకంగా ఉంది. ప్రస్తుతం బాక్స్ ధర రూ. 400 నుంచి రూ. 500 పలుకుతుంది. వారంతపు సంతలో టమాట కిలో రూ.40 నుంచి 50 అమ్ముతున్నారు. దిగుబడులు అధికంగా ఉన్నప్పుడు ధరలు లేక నష్టపోయామని, అరకొరగా పంట ఉన్నప్పుడు ధరలు పెరిగాయని కంబాలపల్లికి చెందిన రైతు శ్రీనివాస్ వాపోయారు. కొందరు మాత్రమే పెరిగినఽ ధరలు పొందుతారని ఆయన పేర్కొన్నారు.

టమాటా.. రైతులకు ఊరట