
అథ్లెటిక్స్‌లో విద్యార్థినికి 6 గోల్డ్ మెడల్స్
కొండపాక(గజ్వేల్): సిర్సనగండ్ల ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థిని ఎర్రోళ్ల ప్రణీత అథ్లెటిక్స్ పోటీల్లో ఆరు గోల్డ్ మెడల్స్ సాధించారని ఎంఈఓ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. జూన్ 4న, 29న జిల్లా స్థాయిలో నిర్వహించిన రన్నింగ్, బ్రాడ్ జంప్ పోటీలో నాలుగు గోల్డ్ మెడల్స్‌ను సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపికై ందన్నారు. హైదారాబాద్‌లోని జింఖాన గ్రౌండ్స్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో 60 మీటర్ల రన్నింగ్, లాంగ్ జంప్ పోటీల్లో గోల్డ్ మెడల్స్ దక్కించుకుందన్నారు. ఈసందర్భంగా ప్రణీతను ఫిజికల్ డైరెక్టర్ ఉప్పలయ్యతో పాటు పలువురు ప్రత్యేకంగా అభినందించారు.