
బర్త్ సర్టిఫికెట్ జాప్యం చేస్తున్నారని..
జహీరాబాద్ టౌన్: తన కుమారుడి బర్త్ సర్టిఫికెట్ జారీ చేయడంలో జాప్యం చేస్తున్నారని ఓ వ్యక్తి మంగళవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట హల్‌చల్ చేశాడు. మండలంలోని హోతి(బి) గ్రామానికి చెందిన బోయిని శేఖర్(35) తన కుమారుడు రాము బర్త్ సర్టిఫికెట్ కోసం మీ సేవలో దరఖాస్తు చేసుకున్నాడు. నెలలు గడుస్తున్నా సర్టిఫికెట్ జారీ చేయడం లేదని కోపంతో మద్యం తాగి పెట్రోల్ సీసాతో జహీరాబాద్ తహసీల్దార్ కార్యాలయానికి వచ్చాడు. ఎందుకు బర్త్ సర్టిఫికెట్ ఇవ్వడంలేదంటూ అధికారులను నిలదీశాడు. కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. అక్కడే ఉన్నవారు అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు స్టేషన్‌కు తీసుకెళ్లారు.
సర్టిఫికెట్ జారీ చేశాం
శేఖర్ కుమారుడి బర్త్ సర్టిఫికెట్ పెండింగ్‌లో లేదని తహసీల్దార్ దశరథ్ పేర్కొన్నారు. సర్టి ఫికెట్ ఎప్పుడో జారీ చేశామని, మీ సేవలో ప్రింట్ తీసుకోవాల్సి ఉందన్నా రు. మీ సేవకు వెళ్లకుండా తహసీల్దార్ కార్యాలయానికి వచ్చాడని ఆయన పేర్కొన్నారు.
హర్షం వ్యక్తం చేస్తున్న
అన్నదాతలు
జహీరాబాద్ టౌన్: నెల రోజుల వరకు టమాట పంట రైతులను ఆందోళనకు గురిచేసింది. బోరు బావులు, స్థానిక నీటి వనరులను వినియోగించుకొని సాగు చేసిన పంట చేతికి వచ్చే సమయానికి గిట్టుబాటు ధరలేక తీవ్రంగా నష్టపోయారు. టమాట తెంపిన కూలీలు, మార్కెట్‌కు తరలించేందుకు రవాణా చార్జీలకే సరిపోయింది. కమీషన్ ఏజెంట్ల వద్ద 25 కిలోల బాక్స్ రూ.100కు అమ్మాల్సి వచ్చింది. సంతలో కిలో రూ.10కు అమ్ముకున్నారు. కొన్ని రోజుల నుంచి టమాట ధరలు పెరుగుతుండటంతో రైతులు ఊరట చెందుతున్నారు.
ఆదుకుంటుందని యాసంగిలో సాగు చేసిన టమాట పంట వల్ల రైతులు నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. ధరలు పడిపోవడంతో పెట్టుబడులు కూడా రాలేదు. పంట దిగుబడి పెరగడంతో కొనేవారు కరువయ్యారు. వేల రూపాయల పెట్టిన పెట్టుబడి దక్కలేదు. జిల్లాలో సుమారు 537 ఎకరాల్లో టమాట పంట సాగవగ పడిపోయిన ధరల వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోవాల్సి వచ్చింది. జహీరాబాద్ మార్కెట్‌కు లోకల్ టమాటతో పాటు మహారాష్ట్ర నుంచి టమాట వస్తుంది. డిమాండ్ కన్నా దాదాపు రెట్టింపు రావడం వల్ల ధరలు పడిపోవడానికి కారణమవుతోంది. ఒక్కసారిగా పంట చేతికి రావడంతో ధరలు పతనమయ్యాయి. కూలీలు, రవాణా చార్జీలు మీదపడుతున్నాయని కొంత మంది రైతులు పంటను పొలంలోనే వదిలేశారు.
బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫీసులో చోరీ
నర్సాపూర్: నర్సాపూర్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫీసులో చోరీ జరిగిందని ఎస్‌ఐ లింగం చెప్పారు. ఆ సంస్థలో డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేస్తున్న పూర్ణచందర్‌రెడ్డి ఈనెల 5న ఆఫీసుకు తాళం వేసి వెళ్లాడని, 7న ఉదయం తిరిగి ఆఫీసుకు వచ్చే సరికి తాళం పగులగొట్టి ఉంది. కౌంటర్‌లో ఉన్న రూ, 1500 ఎత్తుకు వెళ్లారు. పూర్ణచందర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం