ఫోన్‌ కొనివ్వలేదని అలిగి... | - | Sakshi
Sakshi News home page

ఫోన్‌ కొనివ్వలేదని అలిగి...

Jul 9 2025 7:44 AM | Updated on Jul 9 2025 7:44 AM

ఫోన్‌

ఫోన్‌ కొనివ్వలేదని అలిగి...

చేగుంట(తూప్రాన్‌): ఫోన్‌ కొనివ్వలేదని అలిగిన ఓ విద్యార్థి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి కథనం ప్రకారం.. చేగుంటకు చెందిన షేక్‌ ఆసిఫ్‌ (16) తనకు ఫోన్‌ కొనివ్వాలని తల్లిదండ్రులను కోరాడు. వారు నిరాకరించడంతో అలిగిన ఆసిఫ్‌.. ఈనెల 4న ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయాడు. బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో తండ్రి షాదుల్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

గంజాయి విక్రయిస్తున్న

యువకుడి అరెస్టు

చేర్యాల(సిద్దిపేట): గంజాయి విక్రయిస్తున్న యువకుడిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ వి.నవీన్‌ తెలిపాడు. మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి శివారు కటికె బండ వద్ద ఓ యువకుడు గంజాయి విక్రయిస్తున్నాడని విశ్వసనీయ సమాచారం మేరకు సిద్దిపేట టాస్క్‌ ఫోర్స్‌, చేర్యాల పోలీసులు దాడి చేసి సోహెల్‌ పాషాను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అతని వద్ద నుంచి 115 గ్రాముల గంజాయి, సెల్‌ ఫోన్‌ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపాడు. విచారించగా హైదరాబాద్‌ దూల్పేటలో గుర్తుతెలియని వ్యక్తి నుంచి కొనుగోలు చేసినట్లు తెలిపాడు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు తెలిపాడు.

మందుబాబులకు జరిమాన

సంగారెడ్డి క్రైమ్‌: డ్రంకెన్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడిన వాహనదారులకు సంగారెడ్డి జిల్లా న్యాయస్థానం జరిమాన విధించింది. సంగారెడ్డి ట్రాఫిక్‌ సీఐ రామకృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం అర్ధరాత్రి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తా, పాత బస్టాంట్‌ వద్ద, బైపాస్‌లోని గుర్రపు బొమ్మ వద్ద నిర్వ హించిన డ్రంకెన్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల్లో ఏడు మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన చెప్పారు. వారిని మంగళవారం సంగారెడ్డి జిల్లా న్యాయస్థానంలో హాజరుపరచగా జిల్లా అదనపు న్యాయమూర్తి షకీల్‌ అహ్మద్‌ సిద్దిఖీకి రూ. రెండు వేలు, ముగ్గురికి రూ.1500, మిగ తా ముగ్గురికి రూ.1000, చొప్పున జరిమాన విధించినట్లు ట్రాఫిక్‌ పోలీసులు పేర్కొన్నారు.

విద్యుదాఘాతంతో

మూడు గేదెల మృత్యువాత

పటాన్‌చెరు టౌన్‌: పటాన్‌చెరు మండలం రుద్రారంలోని పెద్ద చెరువులో మంగళవారం విద్యుదాఘాతంతో మూడు గేదెలు మృత్యువాత పడ్డాయి. విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యం వల్లే తన గేదెలు మృతి చెందాయని, రూ. 4లక్షలు నష్టపోయానని, ప్రభుత్వం తనను ఆదుకోవాలని బాధితుడు మహేశ్‌ కోరాడు. చెరువులో విద్యుత్‌ స్తంభాలు ఉండటమే తరచూ గేదెలు మృత్యువాత పడుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

రూ.87.94 లక్షల

వడ్డీలేని రుణాలు

ఐకేపీ ఏపీఎం రుక్ష్మిణి

తూప్రాన్‌: మండల మహిళా సమైఖ్యకు ప్రభుత్వం రూ.87.94 వడ్డీలేని రుణాలను మంజూరు చేసిందని ఐకేపీ ఏపీఎం రుక్ష్మిణి పేర్కొన్నారు. మంగళవారం మహిళా శక్తి సంబురాలు కార్యక్రమం నిర్వ హించారు. ఈ సంబురాలు గ్రామాల వారీగా ఈనె ల 18వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే గ్రామాల్లో మహిళ సంఘాల ద్వారా మహిళలు ఆర్థికంగా పురోగతి సాధిస్తున్నట్లు తెలిపారు.

ఫోన్‌ కొనివ్వలేదని అలిగి... 
1
1/2

ఫోన్‌ కొనివ్వలేదని అలిగి...

ఫోన్‌ కొనివ్వలేదని అలిగి... 
2
2/2

ఫోన్‌ కొనివ్వలేదని అలిగి...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement